7

"మేజిక్ కార్ప్" > "గ్యారడోస్" గా రూపాంత్రం చెందుతుంది.

మేజిక్ కార్ప్ గ్యారడోస్గా రూపాంత్రం చెందడం చాలా అరుదు. ప్రతీ 250 మేజిక్ కార్ప్ లలో ఒక్కటి మాత్రమే గ్యారడోస్గా రూపాంత్రం చెందుతుంది. మిగతావి శాశ్వతంగా మేజిక్ కార్ప్ లాగే బ్రతికి గుడ్లు పెట్టి చనిపోతాయి.

*మేజిక్ కార్ప్ (స్టేజ్ 1) ఒక చేప ఆకారపు వాటర్ టైప్ పోకిమాన్. 10 అడుగుల పొడవు ఉంటుంది. అన్నీ పోకిమాన్లలో అతి బలహీనమయినా పోకిమాన్. ఎటువంటి ఆటాక్స్ చేయడం చేతకాదు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎంత బలమైన నీటి ప్రవాహానికి అయినా ఎదురు ఈదుతుంది.

*గ్యారడోస్ (స్టేజ్ 2) ఒక డ్రాగన్ టైప్ పోకిమాన్. 100 అడుగుల ఎత్తు వరకూ ఉంటాయి. కోపం చాలా ఎక్కువ. దీనికి కోపం తెప్పిస్తే ఊరిని సైతం అంతం చేసేస్తుంది. వాటర్+డ్రాగన్ టైప్ పోకిమాన్. ట్రయినింగ్ ఇస్తే ఫైర్ టైప్ అటాక్స్ కూడా బలంగా చేస్తుంది. అతి శక్తి వంతమయిన అటాక్ డ్రాగన్ రేజ్.

####

మహేంద్ర భయంతో పరిగెత్తుకొని వెళ్లి ఓహో వెనక దాక్కుంటాడు.

మహేంద్ర కాళ్ళు గజా గజా వణుకుతా ఉంటాయి.

ఓహో: క్యూ?.. (ఎందుకు డిస్కో డాన్స్ వేస్తున్నావ్?)

మహేంద్ర: నేనెక్కడ వేస్తున్న? అవే కదులుతున్నాయి....

గ్యారడోస్: గ్యారడోస్?!! (నన్నే ఫ్రై చేస్తా నంటావా? చూస్తుండు! నేనే నిన్ను ఫ్రై చేసుకోని తింటా!)

అని కోపంగా అరుస్తూ వెంటపడుతుంది.

గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యారడోస్!!!! (ఓయ్! వాడ్ని నాకు అప్పజెప్పి! అడ్డు తప్పుకో!!!)

అని గట్టిగా అరుస్తుంది.

ఓహో: క్యా? క్యూ× (వీడా? కుదరదు×)

అని చెప్పి, రెస్ట్ తీసుకుంటూ సైలెంటుగా కళ్ళు మూసుకుంటుంది.

గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యారడోస్!!!! (నీకు నా సంగతి తెలీదు! ఇప్పుడే వాడ్ని నాకు అప్పగించు! లేకుంటే నీ రెక్కలన్నీ కాల్చేస్తా!)

అని కోపంతో అరుస్తూ బెదిరిస్తుంది.

ఓహో: క్యూ!~~ (ఏం పీక్కుంటావో పీక్కో!~)

అని చెప్పి ఆవులిస్తుంది.

మహేంద్ర: బాబోయ్... నన్ను ఎక్కడ దానికి ఇచ్చేస్తా వేమోనని భయపడ్డాను..

ఓహో: క్యూ?? (చాలా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావ్? దానికే ఇచ్చేయ్ మంటావా?)

మహేంద్ర: వద్దోద్దూ.... నువ్వు బెష్టు నేను ఫ్రెండు మనిద్దరం బెష్టు ఫ్రెండ్సు! ఎప్పుడూ విడిపోము! కలిసే బతుకుదాం! కలిసే పోదాం!

అని కష్టపడుతూ మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు.

ఓహో: క్యూ...~~ (నాకేం నువ్వు సెపరేటుగా చెప్పక్కర్లేదు. నిన్ను కొట్టినా చంపినా అది నేనే అయుండాలి! నా చేతుల్లోనే అయుండాలి! ఎందుకంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్!! మధ్యలో మూడో వాడు దూరితే నా కాలితో పురుగులు నలిపినట్టు నలిపేస్తా!!)

గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యార! గ్యారడోస్!!! (నేనొక డ్రాగన్ పోకిమాన్ అన్న విషయం తెలీదా నీకు? నేను చాలా పవర్ఫుల్! నా జోలికి వస్తే-)

ఓహో: క్యూ???!!?! (ఏంచేస్తావ్? హా? ఏంచేస్తావేంటి? నీ కంటే తోపు గాళ్లనే కాల్చి ఫ్రై చేసుకోని తిన్నోడిని నేను! నువ్వు నన్నేం చేస్తావ్!? నా ఈకల్లో తీగను కూడా పీకలేవ్! పిచ్చి పురుగు!)

గ్యారడోస్కి చాలా కోపం వస్తుంది.

గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యార! గ్యార! గ్యార! గ్యారడోస్!!!!

(ఎంత ధైర్యం ఉంటే నన్నే పురుగంటావ్!? రా! పోటీ పెట్టుకుందాం! మనలో ఎవరు పురుగో! పోటుగాడో! తలపడి చూద్దాం! నేను గెలిస్తే వాడు నాకు ఫుడ్డు అయితే నువ్వు నా బానిసవి అవ్వాలి!)

ఓహో: క్యూ?.. (మరి నేను గెలిస్తే?)

గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యారడోస్!!!! (నువ్వు చెప్పినట్టుగా నేను పురుగునని ఒప్పుకుంటా! ఆ కట్టె పుల్లకి జీవితాంతం బానిసలా పడుంటా!! ఓకేనా??!!)

అని కోపంలో సభదాలు చేసేస్తుంది.

ఓహో: క్యూ క్యూ క్యూ.... (హిహిహిహి.... చూద్దాం! చూద్దాం! పిల్లి పిత్తిరి!

మాస్టర్! ధైర్యంగా బయటకు రా! మన జర్నీ మొదలు పెట్టిన తరువాత మన మొదటి మ్యాచ్ ఇదే! ఈ పురుగుని కాల్చి వార్మప్ చేద్దాం!

మహేంద్ర: ఏంటి?... నేనేం చేయను?...

ఓహో: క్యూ??!!! (మర్చిపోయావా? నువ్వు అటాక్స్ చెప్తే నేను అటాక్ చేస్తా! కానివ్వు!)

అని చెప్పి, మహేంద్రను రెక్కలతో పక్కకు నెట్టి ముందుకి వెళ్లి నిలబడుతుంది.

ఓహో: క్యూ!!!!.. (ఇదే మన మొదటి మ్యాచ్! గెలిచినా! ఓడినా! మన మ్యాచ్ గురించి వింటే ప్రపంచమే ఉత్సాహంతో దద్దరిలి పోవాలి!)

మహేంద్ర:....

అలా మహేంద్ర, ఓహోల మొదటి పోకిమాన్ మ్యాచ్ మొదలువ్వుతుంది.

గ్యారడోస్, వాటర్ ఆటాక్స్ చేసే డ్రాగన్ టైప్ పోకిమాన్.

ఓహో, ఫైర్ ఆటాక్స్ చేసే ఫ్లైయింగ్ టైప్ పోకిమాన్.

ఈ పోటీలో ఓహో, మహేంద్రలు గెలుస్తారా? లేదా గ్యారడోస్ నీటి శక్తికి తట్టుకోలేక ఓడిపోతారా?

ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ చదవాల్సిందే....