మహేంద్ర నాలుగు లగేజ్లను వస్తువులతో నింపుతాడు.
మహేంద్ర: ఓకే!! వస్తువులు వరకూ అన్నీ ప్యాక్ చేసేసాం!
వీటిని Dr. మెహ్ర గారి దెగ్గరకు తీసుకెళ్దామా?
ఓహో: క్యూ!? (అడగాలా? పదా!)
అని చెప్పి కిందకు వంగుతుంది.
మహేంద్ర ఒక లగేజ్ తీసుకోని వెళ్లి ఓహో వీపు మీద ఉంచి, పైకి ఎక్కి గట్టిగా పట్టుకుంటాడు.
మహేంద్ర: ఓహో వీటిని ఒక్కసారిగా మోయగలవా? లేదా ఒక్కో లాగేజ్ ఒక్కోసారి మొద్దామా?
ఓహో: క్యూ?! (నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావ్! నేను వెయ్యి కేజీలు సునాయాసంగా ఎత్తి పడేస్తా! అలాంటిది ఈ పెట్టెలు అంత లెక్కేం కాదు నాకు!)
మహేంద్ర: హహహ... నువ్వు చాలా గ్రేట్!
ఓహో: క్యూ! (అది నాకు తెలుసులే~)
అని గర్వంగా చెప్తుంది.
°°°
ఓహో రెండు కాళ్ళతో రెండు లగేజ్ బాగులు, పొడవాటి ముక్కుతో ఒక లగేజ్ బాగ్, వీపు మీద మహేంద్ర, మరో బాగును మోస్తూ ఎగురుతుంది.
మహేంద్ర: అం.... ఏమో అనుకున్నా... నువ్వు నిజంగానే వీటిని ఏ కష్టం లేకుండానే మోస్తూ ఎగురుతున్నావ్..
ఓహో: క్యూ? (కనీసం వీటిని కూడా మోయలేకుంటే నాకూ పిచ్చుక్కి తేడా ఏముంటుంది? తిని రెట్టేయడానికి తప్పా దేనికి పనికిరాను!)
మహేంద్ర: ఫహహహ.... నీకు కూడా తెలీకుండానే నువ్వు బలే జోకులు వేస్తుంటావ్!.. హహహ....
ఓహో: క్యూ? (జోకా? నీ...)
••••
గ్యారడోస్ వెళుతూ ఉండగా ఓహో, మహేంద్రలు మళ్ళీ మరో దిక్కుగా ఎగరటం గమనిస్తుంది.
గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (ఒరే!.. మళ్ళీ అటే పోతారెంట్రా?.. ఛా.. నాతో ఆడుకుంటున్నారు కదరా...)
అని తిట్టుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వేగంగా పాకడం చేస్తుంది.
•••
మహేంద్ర Dr. మెహ్ర షాప్కి చేరుకుంటాడు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర):...
రూం లోపలకు వెళ్లి లగేజ్ లోని వస్తువులన్నీ ఒక చోట పారబోసి మళ్ళీ లగేజ్లను పట్టుకెళ్తాడు.
మహేంద్రను గాల్లో ఎగురుతూ వెళ్లడం చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ వైపుగా పరుగులు తీస్తుంది.
గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (నా కోసం కాసేపు ఆగండ్రా బాబూ!!...)
అని పురుగులా వేగంగా పాకుతూ ఉంటుంది.
•••
మహేంద్ర నెస్ట్ని చేరుకుంటాడు.
మహేంద్ర: ఓహో! చెప్పాగా? అరచేయంత సైజుకి ముక్కలు చెయ్యి.
ఏది చిన్నగా ఉండొద్దు. పెద్దగానూ ఉండొద్దు.
ఓహో: క్యూ! (జస్ట్ ఏ సెకండ్!)
అని చెప్పి తన కాలి పంజాలతో నెస్ట్ వేర్లను ముక్కలు ముక్కలుగా చేస్తుంది.
మహేంద్ర ముక్కలను ఏరుతూ లగేజ్లలో సర్దుతాడు.
నిండాక ఇద్దరూ తిరిగి ఎగురుతూ వెళ్తారు.
గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (శాడిస్ట్ సచ్చినోల్లారా!!! ఆగండ్రా రేయ్!!!...)
అని వెంబడిస్తుంది.
•••
ఆ విధంగా వాళ్లిద్దరూ పది సార్లకు పైగా రౌండ్లు కొడతారు.
గ్యారడోస్ వాళ్ళను వెంబడించీ వెంబడించీ అలసిపోయి పడిపోయి ఉంటుంది.
గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (నా కోసం.. ఆగండ్రా రే... ఆ.. ఆహ్... నేను.. మిమ్మల్ని చేరుకునే దాకా.. ఆగేదే లేదు.. హా..)
అంటూ అలసటతో స్లోగా పురుగులా పాకుతూ వెళ్లి Dr. షాప్కి చేరుకుంటుంది.
°°°
Dr. మెహ్ర అశ్చర్యంతో స్పృహ తప్పి పడిపోయుంటాడు.
మహేంద్ర: అం... ఓహో... వీడు పోయాడంటావా?..
ఓహో: క్యూ?! (అట్టా ఎట్టా పోతాడు?! రే!! సోడా బుడ్డి! పైకి లే!!)
అని అంటూ అతన్ని ముక్కుతో పట్టుకొని ఆకుని విదిలించినట్టు విదిలిస్తుంది.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): ఔ... ఔ... బ్లడా.. బ్లడా... నేను.. ఇంకా బ్రతికే ఉన్నానయ్యా... దింపడయ్యారే...
అని కేకలేస్తాడు.
మహేంద్ర: సార్ బ్రతికే ఉన్నట్టు ఉన్నాడు ఓహో! అతన్ని వదిలేయ్!
ఓహో కింద పడేస్తుంది.
ఓహో: క్యూ!! (అదేగా! మా పని పూర్తి కాకుండా చావాలని చూస్తే తోలు తీస్తా బిడ్డా!)
అని కంటి చూపుతో బెదిస్తుంది.
మహేంద్ర: అహహహ....
షాప్ ఓనర్ (Dr. మెహ్ర):... కచ్చితంగా ఓహో నన్ను బెదిరిస్తోందని అర్థమవుతోంది..
అని చెబుతూ కళ్లద్దాలు సరి చేసుకుంటూ పైకి లేచి నిలబడుతాడు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. ఇవన్నీ నేను అమ్మడానికి టైం పడుతుంది.
మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే డబ్బులు ఆ అకౌంట్లో డైరెక్టుగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను.
మహేంద్ర: అం... నాకూ.. బ్యాంక్ అకౌంట్ లేదు సార్..
షాప్ ఓనర్ (Dr. మెహ్ర):... ఇట్స్ ఓకే! నేను మీ మేనజర్ కాబట్టి ఇలాంటి పనులు నాకు వదిలేయండి Mr. మహేంద్ర.
మహేంద్ర: ఓకే...
°°°
Dr. మెహ్ర, మహేంద్రకు కొత్త ఐడి, బ్యాంక్ అకౌంట్, లైసెన్స్ లాంటివన్నీ చేయించి అతనికి ఇస్తాడు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. ఈవిగొండి. ఇవన్నీ మీకు మినిమం యూస్కి అవసరం అవుతాయి.
నేను మీ బ్యాడ్జ్లను, ఓహో రూట్స్లను నిదానంగా అమ్మి డబ్బులను మీ అకౌంట్లో వేస్తుంటాను.
ఈ మొబైల్ మీతో ఉంచండి. అండ్ ఈ సూట్ సెట్, ఈ వస్తువులు కూడా!
మహేంద్ర: ఓకే సార్.
మహేంద్ర అతను ఇచ్చిన వస్తువులను ధరించి బయటికి వస్తాడు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. మీరు చూడటానికి అచ్చం కాబోయే పోకిమాన్ మాస్టర్ లాగే ఉన్నారు. నువ్వు కూడా ఓహో! హుహుహు...
మహేంద్ర: నిజంగానే అలా ఉన్నామా సార్?! హహహ...
ఓహో: క్యూ? (డౌటా?)
అని గర్వంగా తల ఎత్తి పోసులు కొడుతుంది.
అప్పుడే బయట నుంచి సౌండ్స్ వినిపిస్తాయి.
బయటకు వెళ్లి చూడగా...