మహేంద్ర: నాకేమైంది?.. నా బాడీ ఇక్కడేగా ఉంది?..
మరి ఆ హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నది ఎవరూ?..
అసలు నేను ఈ లోకానికి ఎలా వచ్చాను?..
ఎందుకొచ్చాను?...
నాకు అస్సలు అర్ధం కావట్లేదు...
అని దీర్గమైన ఆలోచనల్లో పడిపోతాడు.
ఓహో: ఏమైన్ది? ఎందుకలా ఉన్నావ్?
అని మహేంద్రను అడుగుతుంది.
మహేంద్ర: నాకు పీడ కల వచ్చింది.. నేను హాస్పిటల్ బెడ్డు మీద చావు బ్రతుకుల మధ్యలో ఉన్నట్టు..
అని చెబుతూ సైలెంట్ అయిపోయి ఆలోచనల్లో మునిగిపోతాడు.
ఓహో అతన్ని దీర్గంగా పరిశీలిస్తూ ఉంటుంది.
గ్యారడోస్ వాళ్ళ మాటలు విని దిగులు పడుతూ ఓహోని చూస్తాడు.
ఓహో: నేనున్నంత వరకూ నీ ప్రాణాలకు ఏమీ కనివ్వను! నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు!
గ్యారడోస్: నేను కూడా! నేను కూడా!!
మహేంద్ర స్మైల్ చేస్తాడు.
మహేంద్ర: థాంక్యూ ఓహో. థాంక్యూ గ్యారడోస్.
మీరిద్దరూ ఉండగా దిగులెందుకు దండగ~
అని చెబుతూ నవ్వేస్తాడు.
గ్యారడోస్ సంతోషంతో కుక్క పిల్లలా తోక ఊపుతూ డాన్స్ వేస్తాడు.
ముగ్గురూ నవ్వుకుంటారు.
****
ముగ్గురూ ప్రయాణం కంటిన్యూ చేస్తుంటారు.
దారిలో ఎటువంటి ఆటంకం లేకుండా ఇన్నాళ్ళూ ప్రయాణిస్తున్న మన హీరోలకి ఒక చిక్కు ఎదురవ్వుతుంది.
మహేంద్ర: హ్మ్....
అతని చేతిలో మ్యాప్ బుక్ ఉంటుంది.
మహేంద్ర: ఇప్పుడు మనం ఎటెళ్లుదాం?..
ఎటు వెళ్లినా ఒకటే గమ్యం.
ఓహో: పోకిమాన్ ట్రైనర్స్, పోకిమాన్స్ ఉండే వైపు వెళితే మంచిది.
నాకు నా మొదటి పోకిమాన్ ట్రైనర్ బాటిల్ చేయాలని ఆతృతగా ఉంది.
మహేంద్ర: ఓహ్! ఓకే?! ఈ మ్యాప్ ప్రకారం చూస్తే కుడివైపుగా వెళితే పర్వతాలు ఉన్నాయి.
ఎడమ వైపుగా వెళితే పెద్ద నీటి కాలువ అడ్డుగా ఉంటుంది.
గ్యారడోస్: మరి నేరుగా వెళితే?
ఓహో: కొండ ఉంటుంది. అక్కడి నుంచి దూకేయ్!
గ్యారడోస్: చూసావా మాస్టర్!🥹 బాయా నన్ను ఏమంటున్నాడో..
మహేంద్ర: ఓహో!... (అని ఓహోని సూటిగా చూసి) ఓహో మనల్ని ఎగురుకుంటూ వెళ్దామా అని సలహా ఇస్తున్నాడు అంతే..😅
గ్యారడోస్: అవునా? నిజంగా? 🤧
మహేంద్ర: నీకు అబద్దం చెప్తానా ఏంటి? 🤥
గ్యారడోస్: అయితే ఓకే. ☺️
ఓహో: 😑
మహేంద్ర: హహహహ....