12

నోటీస్:

ఈ టైం టేబుల్ మీదే ఇక నుంచి చాఫ్టర్స్ అప్లోడ్ అవుతాయి. అన్నీ సిరీస్ చదివే వాళ్ళు, మీ ఫేవరెట్ సిరీస్ చదివే వాళ్ళు అప్లోడ్ చేసే డేట్స్

గుర్తు పెట్టుకోండి.

S̤C̤H̤E̤D̤ṲL̤E̤ T̤I̤M̤E̤ T̤A̤B̤L̤E̤:

టైం: 12:00 am (పొద్దున)

𝗧𝗨𝗘/𝗧𝗛𝗨𝗥𝗦/𝗦𝗔𝗧:

మంగళ/గురు/శని:

•ఫరీద: నేనొక ట్రాన్స్మిగ్రేటర్

•IPS మొగుడు డాన్ పెళ్ళాం

𝗠𝗢𝗡/𝗪𝗘𝗗/𝗙𝗥𝗜:

సోమ/బుధ/శుక్ర:

•పోకిమాన్ మాస్టర్

•స్వర్డ్ మాస్టర్

𝗦𝗨𝗡𝗗𝗔𝗬/𝗢𝗧𝗛𝗘𝗥:

ఆదివారం/ఎప్పుడైనా:

•మెరుపువేగం 

──•~❉©Farruarts©❉~•──

అతను చెప్పేది నిజం కాదని కనిపెట్టేసిందేమోనని మహేంద్ర కంగారు పడుతూ ఉంటాడు.

పోలీస్ ఆఫీసర్: హ్మ్... ఎమోషనల్ స్టోరీయేనీది..

కానీ నేను ఎమోషనల్ పర్సన్ కాను. నాకు తెలిసింది దొంగతనాలు, దోపిడీలు చేసే వాళ్ళని మక్కెలు విరిచి జైల్లో పడేయటమే.~

నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు గనుక నీకు చిన్న హెల్ప్ చేస్తాను.

పదా!

అని చెబుతూ అతన్ని ఒక షాప్కి తీసుకెలుతుంది.

@@@@

వాళ్ళు ఉన్నది ఒక పాత కాలపు అంగడి. మహేంద్ర దిక్కులు చూస్తూ లోపలకు వెళ్తాడు.

అంగడిలో ఎన్నో రకరకాల బ్యాడ్జ్లు, బెల్టులు, గ్లౌసులు, ట్రోఫీలు,... లాంటివి ఎన్నో వస్తువులు డిస్ప్లేలో ఉంటాయి.

అవన్నీ అసలైన లెదర్, బంగారం, వజ్రాలతో పొదిగి తయారు చేసినవయి ఉంటాయి.

మహేంద్ర దిక్కులు చూస్తూ పోలీస్ ఆఫీసర్ను ఫాలో చేస్తుంటాడు.

షాప్ ఓనర్: హలో ఆఫీసర్ లక్కీ. ఏం టిలా వచ్చారు? నాతో ఏమైనా పనుందా?

ఇంతకీ ఈ అబ్బాయ్ ఎవడు?

మీ బాయ్ఫ్రెండా?

అని ఆట పట్టిస్తాడు.

పోలీస్ ఆఫీసర్ లక్కీ: అంకుల్! మీకెన్నిసార్లు చప్పాలి? అలా మాట్లాడొద్దని!?

అని ఫ్రస్టేట్ అవుతుంది.

షాప్ ఓనర్ పకా పకా నవ్వుతాడు.

షాప్ ఓనర్: హహహహ.... తమాషాగా అన్నానులే లక్కీ. అలగకు.

ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో చెప్పలేదు నువ్వు?!

ఆఫీసర్ లక్కీ: ఈ అబ్బాయి ఒక పోకిమాన్ ట్రైనర్! బ్యాడ్జ్లు అమ్మడానికి దారి తెలీదంటే మీ షాప్ చూపించడానికి వచ్చాను.

ఇప్పుడు నా పని పూర్తి అయింది కాబట్టి నా స్టైషన్కి బయలుదేరాలి. బై!! మహేంద్ర! బై అంకుల్!

అని చెప్పి వెళ్లి పోతుంది.

°°°

షాప్ ఓనర్: చెప్పు మహేంద్ర!! నువ్వు ఏం బ్యాడ్జ్లు అమ్మడానికి వచ్చావు??

మహేంద్ర: అం... ఇవి..

అని చెబుతూ మొహమాటంగా జోబీ నుంచి బ్యాడ్జ్లను బయటకు తీస్తాడు.

షాప్ ఓనర్: హ్మ్...

అతను కాసేపు అన్నీ బ్యాడ్జ్లను పరీక్షస్తాడు.

అవి అసలైనవా కాదా, వాటి మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, ఏమైనా పార్ట్స్ విరిగి ఉన్నాయా అని పరీక్షిస్తాడు.

కొన్ని నిమిషాల తరువాత.,

షాప్ ఓనర్: ఓకే అబ్బాయ్! ఇవన్నీ ఒరిజినల్ బ్యాడ్జ్లే!! పెద్దగా స్క్రాచెస్ లేవు. ఏం పార్టులు పోలేదు. సో... విటన్నిటి వాల్యూ...

అని ఆలోచిస్తూ ఉంటాడు.

మహేంద్ర:...

షాప్ ఓనర్: 20 క్లీన్ బ్యాడ్జ్లు. 2 మిలియన్ పెంటాకల్స్ ఇస్తాను. ఏమంటావ్?

మహేంద్ర: పెంటకాల్స్?... అం... సార్.. అది...

షాప్ ఓనర్: సరే! సరే!... 2.5 మిలియన్ పెంటకల్స్ ఇస్తా!! ఇప్పుడు?

మహేంద్ర: అసలు పెంటకల్ అంటే ఏంటి? దాని వాల్యూ ఎంతుంటుంది?.. నాకు తెలీదే..

అని ఆలోచిస్తూ ఉంటాడు.

షాప్ ఓనర్: అబ్బబ్బా... 3 మిలియన్ పెంటకల్స్!! ఇదే ఫైనల్! దీనికంటే ఎక్కువ ఇవ్వడం కుదరదు!! నేనిచ్చిన మార్కెట్ రేట్ మరొకరు ఇవ్వరు!! ముందే చెప్తున్నా!!

మహేంద్ర: అం... సరే సార్...

అని ఒప్పుకుంటాడు.

ఇద్దరూ షేక్ హ్యాండ్ చేసి డీల్ కుదుర్చుకుంటారు.

షాప్ ఓనర్: ఓకే!! నేను మనీ సెటిల్ చేసే వరకూ షాపులో వస్తువులు చూస్తూ ఉండు. ఏమైనా నచ్చితే నాకూ వ్యాపారం జరిగినట్టు ఉంటుంది.

మహేంద్ర: ఓకే సార్.

అని చెప్పి షాపులో చుట్టూ తిరిగి చూస్తుంటాడు.

@@@

మహేంద్ర: హ్మ్.... ఇక్కడ చాలానే వస్తువులున్నాయి. ఇది పోకిబాల్. ఇక్కడున్న పోకిబాల్స్ అన్నిటికీ బంగారు పూతలు వేసి ఉన్నాయి. కొన్నిటికయితే రంగు రాళ్లు, వజ్రాలు కూడా పొదిగి ఉన్నాయి..

నా జీవితంలో ఇన్ని వజ్రాలు ఎప్పుడూ చూడలేదు..

కనీసం డైమండ్ జ్యువలరీ షాప్లో కూడా...

ఇక్కడ ఎటు చూసినా ఇవే..

అని ఆలోచిస్తూ వాటి రేట్లు చూస్తాడు.

మహేంద్ర: 20వేల పెంటకల్స్?.. దీనిమీద వజ్రాలు పొదిగి ఉన్నాయి..

మరైతే 3 మిలియన్ పెంటకల్స్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది?..

బహుశా ఆ డబ్బులతో ఒక బంగళా కొనుక్కోవచ్చు ఏమో.

అని అనుకుంటాడు.

పక్కనే టేబుల్ మీద ఒక బుక్ ఉంటుంది. దాన్ని చూసి చేతిలోకి తీసుకోని ఓపెన్ చేస్తాడు.

మహేంద్ర: హ్మ్... ఇదొక ఏరియా మ్యాప్ బుక్. దింట్లో ఊర్ల పేర్లు.. స్ట్రీట్స్ పేర్లు.. ఇమేజెస్, ఇన్ఫో ఉన్నాయి.

మనీ వాల్యూ కూడా ఏమైనా ఉంటుందేమో చూద్దాం...

అని ఆలోచిస్తూ బుక్కు పేజీలు తిప్పుతూ ఉంటాడు.

మహేంద్ర: హా! దొరికింది. మా లోకంలోని డబ్బులు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఒక పెంటకల్ వచ్చి...

వాట్?!!! ఒక పెంటకల్ 10 వేల రూపాయలా?..

అం... 3 మిలియన్ పెంటకల్స్ అంటే...