ఒక పెంటకల్ వచ్చి...
వాట్?!!! ఒక పెంటకల్ 10 వేల రూపాయలా?..
అం... 3 మిలియన్ పెంటకల్స్ అంటే...
....
అంత డబ్బులా?..
నాకు నమ్మ సఖ్యం కావట్లా!!
@@@
అతను మొత్తం షాప్ అంతా ఆసక్తితో తిరుగుతూ వస్తువులను చూస్తాడు.
*క్లోత్స్ సెక్షన్*
అతనికి చాలా రకాల లెదర్ కోట్స్, గ్లౌస్, బెల్ట్స్, బూట్స్, హాట్స్, బాగ్స్.... లాంటి మరెన్నో వస్తువులు ఉంటాయి.
ఒక్కో వస్తువు సెట్ లాగా డిస్ప్లేలో పెట్టి ఉంటుంది.
మహేంద్ర: హ్మ్.. నాకు కూడా బట్టలు కావాలి. ఇక్కడే కొందామా? వేరే రక్కడైనా కొందామా?..
రేట్ ఏమో... 20k పెంటకల్స్. బాబోయ్!! ఒక సెట్ అంతా?..
20,0000 రూపాయలా?.. ఈ డబ్బులతో చిన్న బట్టల కొట్టే పెట్టొచ్చు!..
....
అతను అలా ఆలోచిస్తూ దిక్కులు చూస్తాడు. మహేంద్ర చూపు ఒక వస్తువు మీద పడుతుంది.
మహేంద్ర: ఇదీ...
అతని జోబీలో నుంచి ఒక వస్తువు బయటకు తీస్తాడు.
అదే ఓహో నెస్ట్ వేరు ముక్క.
డిస్ప్లేలో చిన్న ముక్కను పెట్టి ఉంటుంది. అదే 10M పెంటకల్స్ అని రాసి ఉంటుంది.
అతను పరిగెట్టుకుంటూ వెళ్లి షాప్ ఓనర్ ముందు నిలబడుతాడు.
షాప్ ఓనర్:??..
***
అతన్ని తీసుకోని వచ్చి డిస్ప్లే దెగ్గర నిలబెడతాడు.
మహేంద్ర: ఈ వేరు ముక్క ఎందుకు ఇంత రేట్ ఉంది?!
షాప్ ఓనర్: ఓ! ఇదా? దీని పేరే ఓహో రూట్. ఇదీ ఎన్నో వేల సంత్సరాల క్రితం తవ్వకాల్లో బయట పడింది.
ఈ రూట్స్ ఓహో అనబడే లెజెండరీ పోకిమాన్ వేడికి కాలి ఇలా తయారవుతుంది.
దీన్ని చాలా వాటిల్లోనే ఉపయోగిస్తారు.
•బ్యూటీ ప్రోడక్ట్స్
•హెల్త్ ప్రోడక్ట్స్
•హ్యూమన్ మెడిసిన్
•పోకిమాన్ మెడిసిన్
లాంటి వాటిల్లో యూస్ చేస్తారు. ఇవి చాలా అరుదు. అందుకే ఖరీదు ఎక్కువ.
మహేంద్ర: అం... అంటే ఇలాంటిదే...
షాప్ ఓనర్: హ్మ్?? నీకు చెప్పలేదు కదా?!
•బ్రౌన్ కలర్= హై వాల్యూ =1L-5L
•డార్క్ బ్రౌన్ కలర్= నార్మల్ వాల్యూ =20-30K
•బ్లాక్ కలర్= లో వాల్యూ = 5-8K
డిపెండ్స్ ఆన్ క్వాలిటీ.
నేను బాగా కస్టపడి వేలం వేస్తే నాకు డార్క్ బ్రౌన్ కలర్లోని ఓహో రూట్ దొరికింది.
ఏమంటావ్? కొనాలని ఉందా?
మహేంద్ర: అం... నా దెగ్గర ఇలాంటివి కొన్ని ఉన్నాయి.. మీరు కొంటారా?...
షాప్ ఓనర్: యా! నా పనే అది. ముందే చెప్పాను కదా! నీ ప్రోడక్ట్ క్వాలిటీ బట్టి మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో, వాల్యూ తక్కువ ఉంటే ఫీల్ అవ్వకూడదు.
మహేంద్ర: ఒకే...
అని అంటూ జోబీలో నుండి ఓహో రూట్ ని బయటకు తీస్తాడు.
షాప్ ఓనర్ ఆ వేరుని చూసి కళ్ళను పెద్దవి చేస్తాడు. మహేంద్ర చేతిలో నుంచి వేరుని తీసుకోని పరీక్షిస్తాడు.
షాప్ ఓనర్: ఇది.. అసలైనదే.. చాలా నాణ్యమైనది.. దీని విలువ 1L-5L పెంటకల్స్ ఉంటుంది.
ఇది నీకు ఎక్కడిది అబ్బాయ్? ఎక్కడ దొరికింది? ఎలా దొరికింది? ఇది సామాన్యమైన ట్రైనర్లకు దొరకడం అసంభవం! చెప్పూ!!! ప్లీస్!!
అంటూ ఆతృతగా అడుగుతాడు.
మహేంద్ర: నా ఫ్రెండ్ ఇచ్చాడు..
షాప్ ఓనర్: నీ ఫ్రెండ్ ఆ?.. ఎవరతను? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు?
మహేంద్ర: నా పోకిబాల్లో ఉన్నాడు..
షాప్ ఓనర్: అంటే నీ పోకిమాన్కి ఇది దొరికిందా??
మహేంద్ర: నా పోకిమానే దీన్ని తయారు చేసింది..
షాప్ ఓనర్: ఏం వాగుతున్నావ్? తమాషా కాదు!! నేను సీరియస్ గా అడుగుతున్నాను!! చెప్పూ! ఇది దొరికిందా? దొంగలించావా??! నీ పోకిమాన్ చూపించు! నువ్వు సమాధానం ఇవ్వకుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది!
మహేంద్ర కంగారు పడతాడు.
మహేంద్ర: సరే.... మీ ఇష్టం.. కానీ పెద్ద చోటు కావాలి... నా పోకిమాన్ పెద్దది.
షాప్ ఓనర్: సరే!
@@@
వాళ్ళు ఇద్దరూ కలిసి బిల్డింగ్ రూఫ్ టాప్ మీదకు చేరుకుంటారు.
మహేంద్ర తన చేతిలోకి మాస్టర్ బాల్ తీసుకోని చిన్నగా చెప్తాడు,
మహేంద్ర: ఓహో.. అంతా విన్నావుగా? కుంచం ప్రశాంతంగా బిహేవ్ చెయ్యి.. ప్లీస్.. మన ఫ్యూచర్ నీ మీదే ఆధారపడి ఉంది..
అని చిన్న గొంతుతో చెప్పి మాస్టర్ బాల్ని ముందుకు చూపిస్తాడు.
అందులో నుంచి పోకిమాన్ బయటకు వస్తుంది.
ఓహో తన రెక్కలను విశాలంగా రెపరెపలాడిస్తుంది.
షాప్ ఓనర్ ఆశ్చర్యంతో నోరు తెరుస్తాడు.
మహేంద్ర: తనే నా బెస్ట్ ఫ్రెండ్! అండ్ నా పోకిమాన్! ఓహో!!
అని చెప్తాడు. ఓహో అతని పక్కన నిలబడి "క్యూ" అని కూస్తుంది.
షాప్ ఓనర్: నేను ప్రాణాలతో ఉండగా లెజెండరీ పోకిమాన్ ఓహోని చూస్తానని అనుకోలేదు..
అని అశ్చర్యంలో చెప్తాడు.